నవతెలంగాణ - హైదరాబాద్ : అర్నబ్ తుపాను ప్రభావంతో విశాఖపట్నం తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడటంతో పాటు సముద్రం దాదాపు 10 మీటర్ల మేర ముందుకు చొచ్చుకొచ్చింది. దీంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. అప్రమత్తమైన అధికారులు పర్యాటకుల ప్రవేశంపై కఠిన ఆంక్షలు విధించారు. తుపాను తీవ్రత దృష్ట్యా రుషికొండ, ఆర్కే బీచ్‌లను మూసివేశారు. ప్రజలు, పర్యాటకులు బీచ్‌లకు వెళ్లవద్దని, అధికారుల హెచ్చరికలను పాటించాలని సూచించారు.
విశాఖలో 10 మీటర్లు ముందుకొచ్చిన సముద్రం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 27, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)