Magazines

హైదరాబాద్‌లో భారీ శబ్దాలు.. భయాందోళనలో ప్రజలు

1 గంట క్రితం

Loud noises in Hyderabad.. People in panic
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: నగరంలోని రాజేంద్రనగర్‌, ఉప్పర్‌పల్లి, అత్తాపూర్‌, ఎర్రబోడ, లంగర్‌హౌస్‌, కేశవస్వామినగర్‌ ప్రాంతాల్లో మంగళవారం ఉదయం 9.15 గంటల సమయంలో భారీ శబ్దాలు వినిపించాయి. పేలుళ్లను తలపించే శబ్దాలతో ఇళ్లలోని వస్తువులు కదలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భూకంపం వచ్చిందేమోనని పలువురు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్‌, లంగర్‌హౌస్‌ పోలీసులు ఘటనాస్థలాలకు చేరుకుని పరిశీలించారు. భారీ శబ్దాలకు గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. బాంబ్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీమ్‌లతో తనిఖీలు నిర్వహించి వివరాలు సేకరిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్