Magazines

పెరిగిన పసుపు ధరలు.. క్వింటాలుకు ఎంతంటే?

2 గంటల క్రితం

Increased turmeric prices.. How much is it per quintal?
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : నిజామాబాద్‌ మార్కెట్‌లో పసుపు ధరలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. విదేశీ ఎగుమతులకు డిమాండ్‌ పెరగడంతో క్వింటాలు పసుపు ధర రికార్డు స్థాయిలో రూ.28 వేలకి చేరింది. గత మే నెలలో రూ.15 వేలుగా ఉన్న ధరలు ప్రస్తుతం భారీగా పెరగడంతో రైతుల్లో ఆనందం నెలకొంది. గల్ఫ్‌ దేశాలు, బంగ్లాదేశ్‌, మలేషియా నుంచి పసుపుకు డిమాండ్‌ పెరగడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. కోల్‌కతా, చెన్నైలకు చెందిన ఎగుమతిదారులు రోజూ సుమారు 1,000 క్వింటాళ్ల పసుపును విదేశాలకు పంపిస్తున్నట్లు సమాచారం. పంటను నిల్వ ఉంచిన రైతులకు ధరల పెరుగుదలతో భారీ లాభాలు చేకూరుతున్నాయి. సుమారు 25 శాతం మంది రైతులు నిల్వ చేసిన పంటను ప్రస్తుతం అధిక ధరలకు విక్రయించే అవకాశం లభించింది. దేశవ్యాప్త పసుపు వ్యాపారంలో నిజామాబాద్‌ మార్కెట్‌ కీలక పాత్ర పోషిస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్