Magazines

భారత్-న్యూజిలాండ్: మూడో వన్డే రద్దు

24 నిమిషాల క్రితం

India vs New Zealand: Third ODI called off
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: హామిల్టన్‌లోని సెడాన్ పార్క్‌లో భారత్, న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన మూడో వన్డే వర్షం కారణంగా రద్దయింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 2-0 ఆధిక్యంలో ఉంది. అంతకుముందు, శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మ్యాచ్‌ ప్రారంభానికి ముందే హామిల్టన్‌లో వర్షం మొదలవడంతో టాస్‌ ఆలస్యమైంది. మధ్యలో వర్షం తగ్గడంతో మైదాన సిబ్బంది కవర్లు తొలగించి ఆటకు ఏర్పాట్లు చేశారు. అయితే టాస్‌ నిర్వహించే సమయంలో మళ్లీ వర్షం మొదలైంది. ఆటకు బ్రేక్‌ పడింది. పిచ్‌ను కవర్లతో కప్పి వర్షం తగ్గుతుందేమోనని అంపైర్లు, ఆటగాళ్లు చాలాసేపు వేచి చూశారు. పలుమార్లు వర్షం తగ్గినప్పటికీ తిరిగి జోరందుకోవడంతో మైదానంలో నీరు చేరింది. ఆట నిర్వహించేందుకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో చివరకు అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్