నవతెలంగాణ-హైదరాబాద్ : న్యూజిలాండ్ పర్యటనలో టీమ్ఇండియా ఇప్పటికే టీ20 సిరీస్‌ను కైవసం చేసుకోగా.. ఇప్పుడు ఐదు వన్డేల సిరీస్‌ను కూడా దక్కించుకుంది. ఆదివారం జరిగిన ఐదో వన్డేలో భారత్ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమ్ఇండియా 3-1తో కైవసం చేసుకుంది. తొలి రెండు వన్డేల్లో భారత్ గెలవగా.. మూడో వన్డే వర్షం కారణంగా రద్దయింది. నాలుగో మ్యాచ్‌లో కివీస్ గెలిచిన విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా 42.1 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. లక్ష్యఛేదనలో కివీస్ 48.1 ఓవర్లలో 187 పరుగులకు ఆలౌటైంది. డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ (31) టాప్ స్కోరర్. నిక్ కెల్లీ (24), మిచెల్ శాంటర్న్ (24), విల్ యంగ్ (22), మైకేల్ బ్రాస్‌వెల్ (19), క్రిస్టియన్ క్లార్క్ (16) పరుగులు చేశారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3, అక్షర్ పటేల్ 2, సిరాజ్ 2, అకిబ్ నబీ, యశ్ ఠాకూర్, నమన్ ధిర్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
టీమ్ఇండియా బ్యాటర్లలో అక్షర్ పటేల్ (46; 55 బంతుల్లో), ఇషాన్ కిషన్ (46; 58 బంతుల్లో) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. రోహిత్ శర్మ (7), విరాట్ కోహ్లీ (5) నిరాశపర్చారు. శ్రేయస్ అయ్యర్ (22), రుతురాజ్ గైక్వాడ్ (18) రన్స్ చేశారు. చివర్లో మహ్మద్ సిరాజ్ (14*; 20 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్), అర్ష్‌దీప్ (14; 4 బంతుల్లో 2 సిక్స్‌లు) విలువైన పరుగులు రాబట్టారు.






కామెంట్‌లు (0)