నవతెలంగాణ - హైదరాబాద్ : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. బహ్రెయిన్‌లోని అల్-రిఫా, అవాలి ప్రాంతాల్లో ఉన్న అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసినట్లు ఐఆర్‌జీసీ ప్రకటించింది. అమెరికా దురాక్రమణకు ప్రతీకారంగా ఈ దాడులు చేపట్టినట్లు తెలిపింది. దాడుల్లో ఓ పౌర పారిశ్రామిక కేంద్రం దెబ్బతిన్నట్లు బహ్రెయిన్ వెల్లడించింది. పలు డ్రోన్లను అడ్డుకున్నామని, మంటలను అదుపు చేస్తున్నామని పేర్కొంది. మరోవైపు యుద్ధాన్ని ముగించేందుకు దౌత్య చర్చలను ముమ్మరం చేయాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి కోరారు. అమెరికా దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ, తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు హర్మూజ్ జలసంధిని తెరవబోమని స్పష్టం చేశారు. ఖతార్ ప్రతినిధుల బృందం టెహ్రాన్‌లో చర్చలు జరిపింది.






కామెంట్‌లు (0)