నవతెలంగాణ - హైదరాబాద్ : నాగచైతన్య హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మైథలాజికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ విడుదల తేదీపై వస్తున్న వాయిదా వార్తలకు మేకర్స్ చెక్ పెట్టారు. ముందుగా ప్రకటించినట్లుగానే డిసెంబర్ 4, 2026న సినిమా థియేటర్లలోకి రానున్నట్లు స్పష్టం చేశారు. అలాగే నవంబర్ 25న ట్రైలర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా, స్పర్ష్ శ్రీవాస్తవ విలన్‌గా నటిస్తున్నారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తుండగా, అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన రావడంతో ట్రైలర్‌పై ఆసక్తి పెరిగింది.
నాగచైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ డేట్ ఖరారు.. ట్రైలర్ ఎప్పుడంటే?
19 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 22, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)