నవతెలంగాణ-హైదరాబాద్: న్యూజిలాండ్ వేదికగా టీ20 సిరీస్ లో భారత్ రెండు విజయాలు సాధించిన విషయం తెలిసిందే. తొలి టీ20లో 225 పరుగులు, రెండో టీ20లో 180 రన్స్ టార్గెట్ లను అలవోకగా చేధించింది అయ్యర్ సేన. మొత్తం ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో 2-0తో టీమిండియా ఆధిక్యంలో ఉంది. మూడో టీ20లో భారత్ గెలిస్తే సిరీస్ కైవసం కానుంది. తాజాగా ఈ విజయాలపై కివీస్ జట్టు ప్రధాన కోచ్ రాబ్ వాల్టర్ స్పందించారు. కీలక సమయాల్లో అవకాశాలను అందిపుచ్చుకోలేకపోవడం వల్లే విజయం తమకు దక్కలేదని పేర్కొన్నారు. అయితే, జట్టు ప్రదర్శన పట్ల ఆయన సంతృప్తిని వ్యక్తం చేస్తూ, ఆ రెండు మ్యాచ్‌లలోనూ న్యూజిలాండ్ గెలిచే అవకాశం ఉండేదని అభిప్రాయపడ్డారు.
"టీ20 క్రికెట్‌లో గెలుపోటములు చాలా స్వల్ప తేడాతో నిర్ణయమవుతాయని మనకు తెలిసిందే. ఆ రెండు మ్యాచ్‌లలోనూ మనం సులభంగా విజయం సాధించే అవకాశం ఉండేది, "ప్రతి మ్యాచ్‌లోనూ ఒకటి రెండు కీలక అవకాశాలను మనం కోల్పోయాం; ఒకవేళ వాటిని సద్వినియోగం చేసుకుని ఉంటే, విజయం మనదే అయ్యేది. ఇది కొంత నిరాశ కలిగించే విషయమే అయినప్పటికీ, జట్టు ప్రదర్శన పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను" అని ఆయన తెలిపారు.







కామెంట్‌లు (0)