నవతెలంగాణ-హైదరాబాద్ : బెల్జియం తరఫున 16 ఏళ్ల పాటు ఆడిన రొమేలు లుకాకు అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు గుడ్‌బై చెప్పారు. లుకాకు 135 మ్యాచ్‌ల్లో 94 గోల్స్ సాధించాడు. నాలుగు ఫిఫా ప్రపంచకప్‌లు, మూడు యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లలో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచిన లుకాకు.. దేశం తరఫున ఆడటం గర్వకారణమని, 16 ఏళ్ల ప్రయాణానికి బెల్జియంకు కృతజ్ఞతలు తెలిపాడు.






కామెంట్లు (0)