నవతెలంగాణ - హైదరాబాద్ : ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఆదివారం భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో నిర్వహించనున్న భారత్ సమ్మిట్‌కు హాజరుకావాలని రాహుల్ గాంధీని ఆహ్వానించారు. ఈ సందర్భంగా జాతీయస్థాయిలో ఓబీసీ అంశాలపై ఇరువురూ చర్చించారు. అలాగే తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు, పార్టీ బలోపేతం తదితర అంశాలపై కూడా చర్చించినట్లు సమాచారం.
రాహుల్ గాంధీతో మహేశ్‌కుమార్ గౌడ్ భేటీ
23 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 10, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)