నవతెలంగాణ - హైదరాబాద్ : అనంతపురం జిల్లా రాప్తాడులో విద్యార్థినులపై జరిగిన దాడి తనను తీవ్రంగా కలచివేసిందని సినీ నటుడు మంచు మనోజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఓ తండ్రిగా ఈ ఘటన తనను ఎంతో బాధించిందని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. బాధిత బాలికలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. స్నేహితురాలిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో బాలిక ధైర్యాన్ని ప్రత్యేకంగా ప్రశంసించాడు. ఆమెకు తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వాలని కోరాడు. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్న వైద్యులు, సహకరించిన ప్రభుత్వ యంత్రాంగాన్ని అభినందించాడు. మహిళల పట్ల గౌరవం ఇంటి నుంచే ప్రారంభం కావాలని, వేధింపులు, హింసకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చాడు.





కామెంట్‌లు (0)