Magazines

భారత్‌తో వన్డే సిరీస్‌కు ముందు కివీస్‌కు షాక్‌..

1 గంట క్రితం

Shock for the Kiwis before the ODI series with India..

Kiwis

వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : భారత్‌తో వన్డే సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కీలక ఆల్‌రౌండర్లు మార్క్‌ చాప్‌మన్‌, రచిన్‌ రవీంద్ర గాయాల కారణంగా ఐదు వన్డేల సిరీస్‌కు దూరమయ్యారు. వీరిద్దరూ పూర్తిగా కోలుకోవడానికి మరింత సమయం అవసరమని న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు వెల్లడించింది. చాప్‌మన్‌ తొడ కండరాల గాయంతో బాధపడుతుండగా, రచిన్‌ రవీంద్ర భుజం గాయం నుంచి కోలుకోలేదు. వీరి స్థానాల్లో హెన్రీ నికోల్స్‌, డీన్‌ ఫాక్స్‌క్రాఫ్ట్‌లను ఎంపిక చేశారు. టిమ్‌ సీఫెర్ట్‌ ఐదు వన్డేలకూ అందుబాటులో ఉండనున్నాడు. బుధవారం ఆక్లాండ్‌లో భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య తొలి వన్డే జరగనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్