Magazines

ఓటర్ల జాబితాలో పేరు గల్లంతు..ఈసీ కీలక నిర్ణయం

56 నిమిషాల క్రితం

Names missing from the electoral roll – Election Commission takes a key decision
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: ఓటర్ల జాబితాలో పేరు గల్లంతైన వారికి కేంద్ర ఎన్నికల సంఘం (ECI) మరో అవకాశం కల్పించింది. రాష్ట్ర పరిధిలోనే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి నివాసం మార్చుకున్న ఓటర్లకు ఈసీ ప్రత్యేక అవకాశం కల్పించింది. అలాంటి వారు ఫారం-8 సమర్పించకుండానే ఎన్యూమరేషన్ ఫారం, చిరునామా ధ్రువీకరణ పత్రంతో ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించింది. దీనికి సంబంధించి పాత ఓటరు గుర్తింపు కార్డు (EPIC) నంబర్ ఆధారంగా ECINET యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ జాబితాలను పోలింగ్ బూత్‌లు, పంచాయతీ, మున్సిపల్ కార్యాలయాల్లో మరోసారి ప్రదర్శించాలని సూచించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్