నవతెలంగాణ-హైదరాబాద్: క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్ తొలి టీ20లోనే భారీ స్కోర్ చేసింది. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ చేసిన బ్లాక్ క్యాప్స్ (New Zealand) బ్యాటర్లు ఆకాశమే హద్దుగా విరుచుకుపడ్డారు. ఇండియన్ బౌలర్లను ఏమాత్రం కనికరం లేకుండా మైదానం నలుమూలలా బాదేస్తూ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 225 పరుగుల స్కోరు సాధించారు.
ఓపెనర్ ఫిన్ అలెన్ కేవలం 24 బంతుల్లోనే 45 రన్స్‌తో విరుచుకుపడగా, సీఫెర్ట్ (24) మంచి సహకారం అందించాడు. స్టార్ హిట్టర్ గ్లెన్ ఫిలిప్స్ (81 నాటౌట్) సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపిస్తూ అజేయంగా 40 బంతుల్లోనే 8 ఫోర్లు, 4 సిక్సులతో 81 పరుగులు బాది ఇన్నింగ్స్‌ను పీక్స్ తీసుకెళ్లాడు.






కామెంట్‌లు (0)