Magazines

ఇందిరాగాంధీ జయంతి తెలంగాణలో 2వేలకుపైగా భవనాల ప్రారంభోత్సవం

3 గంటల క్రితం

Over 2,000 buildings inaugurated in Telangana on Indira Gandhi’s birth anniversary

Telangana

వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 12, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనుంది. ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించిన 599 గ్రామ పంచాయతీ భవనాలు, 1,399 మహిళా భవనాలు, 184 అంగన్వాడీ భవనాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

సిద్దిపేటలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ‘ఇందిరమ్మ ఇంటింటి కుటుంబ బీమా’ పథకాన్ని ప్రారంభించడంతో పాటు మహిళా సంఘాలకు ఇందిరమ్మ చీరల పంపిణీని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్