Magazines

సిరాజ్‌ పేరు తొలగింపు..బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు

5 గంటల క్రితం

Removal of Siraj's name: Congress criticizes BJP government
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టు ఆటగాళ్ల జాబితా నుండి మహమ్మద్ సిరాజ్‌ను అనుహ్యంగా తప్పించిన విషయం తెలిసిందే. సిరాజ్ పేరు తప్పించడం వెనుక మతపరమైన కోణం ఉందనే ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఈక్రమంలోనే గౌతమ్ గంభీర్ చిన్ననాటి కోచ్ సంజయ్ భరద్వాజ్ శుక్రవారం ఆరోపణలను కొట్టిపారేశారు. జట్టు ఎంపిక పూర్తిగా క్రికెట్ అవసరాలు, జట్టు కూర్పుపైనే ఆధారపడి జరిగిందని ఆయన స్పష్టం చేశారు. గంభీర్ ఎప్పుడూ భారతీయ పేసర్లకు మద్దతుగా నిలిచారని, ఏ ఆటగాడి పట్ల ఆయనకు వ్యక్తిగత కక్షలు లేవని భరద్వాజ్ పేర్కొన్నారు. అంతేకాకుండా, ఒక బలమైన జట్టును నిర్మించడమే ప్రధాన కోచ్‌గా గంభీర్ ప్రాధాన్యత అని ఆయన తెలిపారు.


జట్టులో సిరాజ్ పేరు తొలగింపు పై బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. "అతను మంచి ప్రదర్శన కనబరిచినప్పటికీ, అతనికి జట్టులో చోటు కల్పించలేదని. అతని పేరు 'సిరాజ్' కాబట్టే అతనికి అవకాశం ఇవ్వలేదని . మంచి ప్రదర్శన చేస్తున్నా కూడా అతన్ని ఎంపిక చేయకపోవడంలో వివక్ష స్పష్టంగా కనిపిస్తోంది." కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్