Magazines

ఢిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టు పరిధిలో ఆంక్ష‍లు

1 గంట క్రితం

Restrictions in place around Delhi's Indira Gandhi Airport

Restrictions in place around Delhi's Indira Gandhi Airport

వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇందిరా గాంధీ అంతర్జాతీయ (IGI) విమానాశ్రయం చుట్టూ ఉన్న పాలం సబ్-డివిజన్ పరిధిలో డ్రోన్లు, మానవరహిత విమాన వ్యవస్థలు (UAS), పారాగ్లైడర్లు, హ్యాంగ్-గ్లైడర్లు, ఏరో-మోడళ్ల కార్యకలాపాలపై ఢిల్లీ పోలీసులు 60 రోజుల నిషేధాన్ని విధించారు. ఇతర సందర్భాలలో విమానాశ్రయం పరిధిలోని ఫామ్‌హౌస్‌లు, విందు మందిరాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, భవనాలు, ఇతర వేదికలలో లేజర్ కిరణాల వాడకాన్ని కూడా పోలీసులు నిషేధించారు. పాలం సబ్-డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ముఖ్యంగా విమానాలను ల్యాండింగ్ చేసేటప్పుడు లేజర్ కిరణాల వల్ల పైలట్ల దృష్టి మరలుతున్నట్లు IGI విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కి నివేదికలు అందాయి.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్