Magazines

ఫారెస్ట్ అధికారులపై ఇసుక మాఫియా దాడి

4 గంటల క్రితం

Sand mafia attacks forest officials
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: మధ్యప్రదేశ్‌ షియోపూర్ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాలీ అడ్డుకున్నందుకు ఫారెస్ట్ అధికారులపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన గురువారం మెడికల్ కాలేజీకి సమీపంలో ఉన్న ధేంగ్డా టి-జంక్షన్ వద్ద జరిగింది. నాలుగు మోటార్ సైకిళ్లపై వచ్చిన అరడజన్ మంది దుండగులు అటవీ బృందాన్ని చుట్టుముట్టి, స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్-ట్రాలీని లాక్కెళ్లారు. అధికారుల ప్రకారం, నేషనల్ చంబల్ శాంక్చురీ (షియోపూర్) సూపరింటెండెంట్ సందీప్ రావత్, సబల్‌గఢ్ గేమ్ రేంజ్ రేంజర్ సోమేష్ శర్మ తమ బృందంతో కలిసి సాధారణ గస్తీ నిర్వహిస్తుండగా, మెడికల్ కాలేజీ సమీపంలో ఇసుకతో నిండిన ట్రాక్టర్-ట్రాలీని గుర్తించారు. అక్రమంగా తవ్విన ఇసుకతో ట్రాక్టర్-ట్రాలీని తరలిస్తున్న బృందంపై ఇసుక మాఫియా సభ్యులు రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో ఇద్దరు అటవీ శాఖ సిబ్బంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్