Magazines

సెహ్వాగ్‌ తనయుడు ఆర్యవీర్‌ సెంచరీ..

22 నిమిషాల క్రితం

Sehwag's son Aryavir scores a century..
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ అండర్‌-19 ఆసియా కప్‌లో సెంచరీతో సత్తా చాటాడు. యూఏఈతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఆర్యవీర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 131 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. రెండు రోజుల క్రితం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీంతో యూఏఈతో జరుగుతున్న ఈ మ్యాచ్‌ భారత్‌కు కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు సెమీఫైనల్‌కు అర్హత సాధించనుంది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్