నవతెలంగాణ - హైదరాబాద్ : దక్షిణ ఫిలిప్పీన్స్‌లో ప్రైవేట్ విమానం కూలిపోయింది. ఆరుగురు విదేశీయులతో ప్రయాణిస్తున్న విమానం దావావో డెల్ సుర్ ప్రావిన్స్‌లోని డిగోస్ నగరంలో ప్రమాదానికి గురైనట్లు విపత్తు నిర్వహణ అధికారి జోమర్ కల్లెడో రాయిటర్స్‌కు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది పరిస్థితిపై ఇంకా స్పష్టత రాలేదని వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఫిలిప్పీన్స్‌లో ప్రైవేట్ విమానం కూలి ఆరుగురు విదేశీయులు గల్లంతు
20 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 10, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)