Magazines

లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు..

21 నిమిషాల క్రితం

stock market
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 09, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం ఒడుదొడుకుల మధ్య స్వల్ప లాభాలతో ముగిశాయి. గత వారం భారీ ర్యాలీ తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీల్లో పెద్దగా పెరుగుదల కనిపించలేదు. ఐటీ, మెటల్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఉన్నప్పటికీ.. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఫార్మా, ఆర్థిక రంగ షేర్లలో కొనుగోళ్లు మార్కెట్లకు అండగా నిలిచాయి. ఫలితంగా సెన్సెక్స్‌, నిఫ్టీ లాభాల్లో స్థిరపడ్డాయి.

సెన్సెక్స్‌ 107.25 పాయింట్లు పెరిగి 81,106.65 వద్ద ముగిసింది. నిఫ్టీ 58.25 పాయింట్లు లాభపడి 25,044.65 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌ ప్రారంభంలో సెన్సెక్స్‌ 81,327 పాయింట్లకు చేరింది. ఇంట్రాడేలో 80,519 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది. నిఫ్టీ సైతం 25,084 పాయింట్ల గరిష్ఠం, 24,838 పాయింట్ల కనిష్ఠం మధ్య కదలాడింది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్