నవతెలంగాణ - హైదరాబాద్ : పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌కు జనవరి 28న కోర్టుకు హాజరు కావాలని ఆదేశిస్తూ మేడ్చల్ పోక్సో కోర్టు సమన్లు జారీ చేసింది. 17 ఏళ్ల బాలిక వేధింపులకు గురైనట్లు ఆమె తల్లి ఫిర్యాదు మేరకు మే 2026లో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా పోక్సో చట్టంలోని అదనపు సెక్షన్లు, బీఎన్‌ఎస్ నిబంధనలు, ఆధారాల తొలగింపునకు సంబంధించిన సెక్షన్లు చేర్చిన పోలీసులు మే 16న భగీరథ్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
పోక్సో కేసులో బండి భగీరథ్‌కు సమన్లు జారీ
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 26, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)