Magazines

ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

15 అక్టోబర్, 2026

jantar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: జంతర్ మంతర్‌ను నిరసన ప్రదర్శనలకు కేటాయించిన ప్రాంతాల జాబితా నుంచి తొలగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. వారి సమాధానాలు సంతృప్తికరంగా లేకపోతే చట్ట ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయని ధర్మాసనం స్పష్టం చేసింది. జంతర్ మంతర్‌ను నిరసన స్థలంగా తొలగిస్తూ ఢిల్లీ పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని పిటిషనర్లు సవాలు చేశారు. ప్రత్యామ్నాయంగా ఇతర ప్రాంతాలను కేటాయించడం వల్ల ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడం కష్టమవుతుందని, శాంతియుతంగా నిరసన తెలిపే హక్కుకు విఘాతం కలుగుతుందని వాదించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్