నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమబెంగాల్ ఎస్ఐఆర్పై దాఖలైన అప్పీళ్ల విచారణ కోసం ట్రైబ్యునల్స్‌ను పెంచాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్నికల జాబితాలో తమ పేర్లను చేర్చడం , లేదా తొలగించడంపై ఓటర్లు దాఖలు చేసే అప్పీళ్లను విచారించేందుకు ట్రైబ్యునల్స్ సంఖ్యను పెంచాలని భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ), కోల్‌కతా హైకోర్టులను సోమవారం ఆదేశించింది. తొలగించబడిన ఓటర్లు దాఖలు చేసిన అప్పీళ్లను ఇతరుల అప్పీళ్ల నుండి వేరు చేసి, వాటిని అత్యవసరంగా, మొదటి ప్రాధాన్యతతో విచారణ జరపాలని కూడా ట్రిబ్యునల్స్‌ను ఆదేశించింది. ఓటర్ల జాబితాలో పేర్లను చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన అప్పీళ్లను అవసరమైతే వాయిదా వేయవచ్చని సూచించింది.డిసెంబర్ నెల ప్రారంభానికి ముందే ఎన్నికలు జరగనున్న కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని, ఎన్నికల బరిలో నిలవలేని ఓటర్లు దాఖలు చేసిన అప్పీళ్లను గుర్తించి, వాటిని ప్రాధాన్యత ప్రాతిపదికన విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ పనిని వారం రోజుల్లోగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ట్రైబ్యునల్స్ ప్రాంగణాలను కోల్‌కతా నగర కేంద్రానికి, విమానాశ్రయానికి సమీపంలోకి మార్చాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది.
ట్రైబ్యునల్స్ సంఖ్యను పెంచాల్సిందిగా ఆదేశించిన సుప్రీంకోర్టు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 23, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్లు (0)