నవతెలంగాణ - హైదరాబాద్ : తమిళనాడు సీఎం విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పెరంబూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలన్న విజయ్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. దీంతో ఎన్నికల పిటిషన్‌పై విచారణ కొనసాగనుంది. ఎన్నికల అఫిడవిట్‌లో ఆదాయ, భూముల వివరాలను పూర్తిగా వెల్లడించలేదని ఆరోపిస్తూ ఎస్. దినేశ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఆరోపణలపై విచారణ అవసరమని, ప్రాథమిక దశలోనే కేసును కొట్టివేయలేమని జస్టిస్ వి. లక్ష్మీనారాయణన్ ధర్మాసనం స్పష్టం చేసింది. విజయ్ తరఫు న్యాయవాదులు ఆస్తుల వివరాల్లో తేడాలు ఉన్నంత మాత్రాన ఎన్నికను రద్దు చేయలేరని వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం విజయ్ అభ్యర్థనను తిరస్కరించింది. అయితే, ఈ నిర్ణయంతో విజయ్ ఎన్నిక రద్దు కాలేదని, విచారణ అనంతరం వెలువడే తీర్పుపైనే తుది నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసింది.






కామెంట్‌లు (0)