Magazines

మధ్యప్రదేశ్‌లో తెలంగాణ విద్యార్థిని ఆత్మహత్య

42 నిమిషాల క్రితం

Telangana student commits suicide in Madhya Pradesh

Telangana student commits suicide in Madhya Pradesh

వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : వరంగల్‌ జిల్లాకు చెందిన బీటెక్‌ విద్యార్థిని వైష్ణవి మృతి చెందింది. నర్సంపేట మండలం బుచ్చినాయక్‌ తండాకు చెందిన ఆమె మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ ట్రిపుల్‌ ఐటీడీఎంలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతోంది. వైష్ణవి మృతికి చెన్నారావుపేటకు చెందిన బోడ సుమన్‌ కారణమంటూ ఆమె కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపించారు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి వైష్ణవిని మోసం చేశాడని ఆరోపిస్తూ సుమన్‌ ఇంటి వద్ద మృతదేహంతో ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కుటుంబసభ్యులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్