నవతెలంగాణ - హైదరాబాద్ : మధ్యప్రదేశ్‌లోని భోపాల్ ఇబ్రహీంగంజ్‌లో దీపావళి రోజున విషాదం చోటుచేసుకుంది. ఇంటి ముందు టపాసులు కాల్చవద్దని వారించిన సునీత అనే మహిళపై కొందరు యువకులు కత్తితో దాడి చేశారు. తల్లిని రక్షించేందుకు ప్రయత్నించిన ఆమె 25 ఏళ్ల కుమారుడు అనికేత్ ఖతీక్‌పై నిందితులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అనికేత్ మృతి చెందాడు. సునీత ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి నిందితులు ప్రేమ్ పోస్త్‌వర్, ఆదిత్య రైక్వార్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.
దీపావళి వేడుకల్లో విషాదం.. తల్లిని కాపాడబోయి కొడుకు మృతి!
1 గంట క్రితం

Diwali
వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 11, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)