Magazines

తుషార్‌ కపూర్‌కు బిష్ణోయ్‌ గ్యాంగ్‌ బెదిరింపులు

48 నిమిషాల క్రితం

Tusshar Kapoor receives threats from Bishnoi gang

Tusshar Kapoor

వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : బాలీవుడ్‌ నటుడు తుషార్‌ కపూర్‌కు లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ‘హ్యారీ బాక్సర్‌’ పేరుతో ఓ వ్యక్తి ఫోన్‌ చేసి రూ.5 కోట్లు ఇవ్వాలని, లేదంటే హత్య చేస్తామని హెచ్చరించినట్లు తెలిపారు. దీంతో తుషార్‌ కపూర్‌ ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారం రోజుల క్రితమే ఫిర్యాదు అందినప్పటికీ భద్రతా కారణాలతో ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇటీవల నటుడు టైగర్‌ ష్రాఫ్‌పై కాల్పుల ఘటన నేపథ్యంలో తాజా బెదిరింపులు బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్