Magazines

నీరు, విద్యుత్‌ను పొదుపుగా వాడండి: భట్టి విక్రమార్క

17 అక్టోబర్, 2026

Use water and electricity sparingly: Bhatti Vikramarka
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో నీటిని, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో జరిగిన బతుకమ్మ యంగ్‌ ఫిల్మ్‌మేకర్స్‌ అవార్డుల వేడుకలో ఆయన పాల్గొని పురస్కారాలు అందజేశారు. గతంలో అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో చలి తీవ్రంగా ఉండేదని, ప్రస్తుతం అందుకు భిన్నంగా వాతావరణ పరిస్థితులు మారాయని పేర్కొన్నారు. చలి నుంచి రక్షించుకునే రోజుల నుంచి వేడి నుంచి కాపాడుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్‌ డిమాండ్‌ 20 వేల మెగావాట్లుగా ఉందని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్