- Advertisement -
నవతెలంగాణ – దుబ్బాక
అప్పుడే పుట్టిన శిశువుల నుంచి ఆర్నెల్ల వరకు అమ్మ పాలు పట్టించాలని, శిశువుల శారీరక, మానసిక వృద్ధికి అమృతం వలే పనిచేస్తుందని ఐసీడీఎస్ రామక్కపేట సెక్టార్ సూపర్వైజర్ స్వరూప అన్నారు. బుధవారం దుబ్బాక మండలం రాజక్కపేట లో అంగన్వాడీ సెంటర్- 1 లో నిర్వహించిన ‘ అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాల్లో’ భాగంగా బాలింతలు,గర్భిణీలకు అమ్మ పాల ప్రాముఖ్యతను వివరించారు. ఆర్నెల్లు నిండిన పిల్లలకు అన్నప్రాసన చేయించారు. బరువు తక్కువ ఉన్న రెండేళ్లలోపు పిల్లల గృహ సందర్శన చేసి పలు సూచనలిచ్చారు. పంచాయతీ కార్యదర్శి రవికుమార్, ఎంపీపీఎస్ హెచ్ఎం శ్రీనివాస్, ఏఎన్ఎం శైలజ, అంగన్వాడీ టీచర్లు సత్యవతి, రేణుక, ఆశాలు, పలువురు పాల్గొన్నారు.
- Advertisement -