Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంతల్లి పాలే పిల్లలకు సంపూర్ణ ఆహారం: డీడబ్ల్యుఓ స్వర్ణలత

తల్లి పాలే పిల్లలకు సంపూర్ణ ఆహారం: డీడబ్ల్యుఓ స్వర్ణలత

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
ఇతర ఆహారపదార్ధాలు కన్నా పాలు తాగే వయస్సు పిల్లలకు తల్లి పాలే సంపూర్ణ ఆహారం అని డీడబ్ల్యుఓ స్వర్ణలత అన్నారు. అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలు పురస్కరించుకుని సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అశ్వారావుపేట సెక్టార్ పరిధిలో ఏడు నెలలు నిండిన పిల్లలకు అదనపు ఆహారం అందించడం,అన్నప్రాసన, గర్భిణీలకు శ్రీమంతాలు నిర్వహించిన సందర్భంగా ఆమె తల్లులకు తల్లిపాల ప్రాముఖ్యతను వాటి వల్ల పిల్లలకు కలుగు లాభాలను వివరించారు. ఇమ్యూనైజేషన్   పూర్తి చేసుకొని వయసుకు తగ్గ బరువు ఉన్న పిల్లలను గుర్తించి బహుమతులు అందించారు. అనంతరం పలు అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసారు.స్థానిక వృద్ధాశ్రమం అమ్మ సేవా సదనాన్ని పరిశీలించారు. ఆమె వెంట సీడీపీఓ ముత్తమ్మ, సూపర్వైజర్లు పద్మావతి, సౌజన్య, రమాదేవి, వరలక్ష్మి అశ్వారావుపేట సెక్టార్ టీచర్లు, తల్లులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad