నవతెలంగాణ – మల్హర్ రావు
తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరమని అంగన్ వాడి టీచర్లు అన్నపూర్ణ, సోజన్య,భారతి,రమ అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా మహాదేవపూర్ ప్రాజెక్టు సిడిపిఓ రాధిక,మండల సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి ఆదేశాలతో గురువారం మండలంలోని పెద్దతూoడ్ల గ్రామపచాయితీ కార్యాలయంలో అంగన్ వాడి టీచర్ల ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులు,బాలింతలకు తల్లిపాల ఆవశ్యకత గురించి వివరించారు. తల్లిపాలు పిల్లలకు పట్టించ డంతో రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు.పుట్టిన బిడ్డకు గంటలోపు తల్లిపాలు పట్టించాలన్నారు. ఆరు నెలల వరకు పిల్లలకు తప్పనిసరిగా తల్లిపాలే పాలు పట్టించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయాలు,వైద్య సిబ్బంది, గర్భిణులు, బాలింతలు,చిన్నారులు పాల్గొన్నారు.
తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES