- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
బిడ్డకు తల్లిపాలు ఆరోగ్యంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతుందని అంగన్వాడీ సూపర్వైజర్ ఉమా రాణి అన్నారు. బుధవారం మండలంలోని మద్దికుంటలో తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా తల్లులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు మాట్లాడుతూ.. బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలను అందిస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుందని, డబ్బాల కంటే, తల్లిపాలే బిడ్డకు ఆరోగ్యమని సూచించారు. కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు బొమ్మిడి సుజాత, గజ్జల సుజాత, మూడ వెంకటలక్ష్మి, తల్లులు, కిశోర బాలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -