No menu items!
Monday, August 25, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeతెలంగాణ రౌండప్పిల్లలకు తల్లిపాలే అమృతం..

పిల్లలకు తల్లిపాలే అమృతం..

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
పిల్లలకు తల్లిపాలు అమృతంగా పనిచేస్తాయని పుట్టిన గంట లోపే ముర్రు పాలు పట్టించాలని అనుముల ప్రాజెక్టు ఐసిడీఏస్  సీడీపీఓ ఉదయ శ్రీ అన్నారు. సోమవారం మండల కేంద్రం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో తల్లి పాల వారోత్సవాల సందర్బంగా అంగన్వాడీ  టీచర్లకు, గర్భిణీ, బాలింతలకు అవగాహన కల్పించారు.ప్రతి ఏడాది ఆగస్టు 1 నుంచి తల్లిపాల వారోత్సవాలు ప్రారంభమవుతాయని  నవజాత శిశువు ఆరోగ్యంగా పెరగడానికి తల్లిపాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు.

ప్రకృతి సిద్ధంగా లభించే పాలు బిడ్డకు ఎంతో మేలు చేస్తాయి. తల్లి పాల ల్లో వివిధ రకాల పోషకాలుంటాయని అవి శిశువు పెరుగుదలకు ఉపకరిస్తాయని అన్నారు. అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే అ పోహలు వీడి తప్పకుండా బిడ్డకు పాలు పట్టించాలన్నారు.తల్లి పాలవల్ల పసికందు మెదడు చురుకుగా పని చేయడంతోపాటు జ్ఞాపక శక్తి పెరిగేందుకు దోహదపడుతుందని, గుండె, చర్మ, సంబంధ వ్యాధు లు, ఉబ్బసం, ఆస్తమా, బీపీ, షుగర్‌ రాకుం డా చేస్తాయన్నారు. ఆరు నెలల పాటు శిశువుకు రో జుకు 12 సార్లు పాలు తాగించాలన్నారు.

బిడ్డకు సరిపడా పాలు ఉండాలంటే గర్భంతో ఉన్నప్పుడే తల్లి పౌష్టికాహారం తీసుకోవాలి. ప్రోటీన్లు ఉండే పాలు, చేపలు, గుడ్లు, పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలని తెలిపారు. ఆరు నెలలవరకు బిడ్డకు ఎలాంటి అనుబంధం పోషకాహారం అందించనాకూడదని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏసిడిపీఓ సువర్ణ, మండల వైద్యాధికారీ నగేష్,సీహెచ్ఓ శ్రీనివాస్, సూపర్ వైజార్ సువర్ణ కుమారి,అంగన్వాడీ సూపర్ వైజార్ శశికళ,ఆశా వర్కర్లు,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad