Thursday, September 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తిప్పారం తాండలో ఘనంగా తల్లిపాల వారోత్సవం

తిప్పారం తాండలో ఘనంగా తల్లిపాల వారోత్సవం

- Advertisement -

నవతెలంగాణ – గాంధారి 
గాంధారి మండలంలోని తిప్పారం తాండ గ్రామపంచాయతీలో గల అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు తల్లిపాల ఆవశ్యకతపై తల్లులందరికీ అవగాహన కల్పించడం జరిగింది. పుట్టినప్పటి నుండి ఆరు నెలల వరకు తల్లిపాలే అవశ్యకతని బిడ్డ ఎదగడానికి, ఆరోగ్యంగా ఉండడానికి తల్లిపాలుఅమృతం లాగా ఉపయోగపడుతుందనీ అంగన్వాడీ టీచర్ శారద తెలిపారు. ఆరు నెలల నుండి తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారం అందించాలి. చనువు పాలు ఇవ్వడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. ఈ చనువు పాలు తల్లి బిడ్డల మధ్య అనుబంధాన్ని పెంచుతుంది. బిడ్డ పెరుగుదలకు చనువు పాలు సరియైన పోషకాహారాన్ని అందిస్తుంది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ సింధు, పి ఎ సి ఎస్ డైరెక్టర్ బిషన్ నాయక్ మరియు తల్లులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -