Saturday, August 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగన్వాడి కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలు

అంగన్వాడి కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలు

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని అంగన్వాడి కేంద్రాల్లో శుక్రవారం తల్లిపాల వారోత్సవాలను ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని మెడికల్ అధికారి యేమిమా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈనెల ఏడవ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పుట్టగానే తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం వలన తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని, ముర్రు పాలు బంగారం కంటే విలువైనవన్నారు. తల్లిపాల వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తీర్ణ అధికారి వెంకటరమణ, వైద్య సిబ్బంది మంజుల, అంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్లు, తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -