Saturday, August 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవంగర
లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దవంగర ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఉప్పెరగూడెం గ్రామంలో జరిగిన వేడుకల్లో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు తంగెళ్లపల్లి మల్లికార్జున చారి, తొర్రూరు ప్రాజెక్టు సీడీపీవో కమలాదేవి తో కలిసి గర్భిణీ స్త్రీలు,  బాలింతలకు పండ్లు, బ్రెడ్, నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శిశువు పుట్టిన దగ్గర నుంచి రెండేళ్ల వయస్సు వచ్చే వరకు తప్పనిసరిగా తల్లిపాలు పట్టించాలన్నారు. తల్లిపాలు బిడ్డ మానసిక, శారీరకంగా ఎదుగులకు ఉపయోగపడతాయన్నారు. చాలా మంది తల్లులు పిల్లలకు తేనె, నీళ్లు వంటివి పడుతుంటారని, అలా చేయడం వల్ల బిడ్డ అనారోగ్యానికి గురవుతారన్నారు.

రెండేళ్ల నుంచి బిడ్డకు అనుబంధ పోషకాహారాన్ని అందించాలన్నారు. ప్రతి పల్లెలోనూ తల్లిపాల ప్రాముఖ్యతపై చర్చ జరగాలన్నారు. పిల్లల్లో వ్యాధినిరోధకశక్తి పెరగడానికి తల్లిపాలు ఎంతో దోహదపడతాయన్నారు. అనంతరం అంగన్వాడీ చిన్నారులకు బాసర సరస్వతి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించిన పలకలతో అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ శోభ, లయన్స్ క్లబ్ చార్టెడ్ ప్రెసిడెంట్ ఏదునూరి శ్రీనివాస్, కోశాధికారి ఎడవల్లి మధుసూదన్ రెడ్డి, సెక్రెటరీ రాపోలు శ్రీనివాస్, ఏఎన్ఎం, అంగన్వాడీ టీచర్లు, సహాయకులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -