నవతెలంగాణ- భువనగిరి కలెక్టరేట్
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు నా కోసం కలెక్టర్ కార్యాలయానికి వచ్చే వారు బొకేలు, పుష్ప గుచ్చాలు, శాలువాలు తీసుకొని రావద్దని జిల్లా కలెక్టర్ హనుమంత రావు పిలుపు నిచ్చారు. నూతన సంవత్సరం సందర్బంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు బొకేలు, శాలువాలు, పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలపడం సహజమని, వాటికి బదులుగా పేద విద్యార్థులకు ఉపయోగపడేలా నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, దుప్పట్లు ఇతర సామగ్రి ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. పేద విద్యార్థులకు చేదోడువాదోడుగా నిలవాలని, వాటిని త్వరలో విద్యార్థులకు పంపిణీ చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. పేద పిల్లలకు విద్యా సామాగ్రి ఇవ్వడం ద్వారా పిల్లల చదువుకు ఉపయోగ పడుతాయని, చలి కాలం దుప్పట్లు అందిచడం వలన వారి ఆరోగ్యరక్షణకు ఉపయోగపడతాయని తెలిపారు.
బొకేలకు బదులుగా పెన్నులు, పెన్సిల్స్ తీసుకురండి: కలెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



