Thursday, July 31, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఇజ్రాయిల్‌కు బ్రిట‌న్ వార్నింగ్

ఇజ్రాయిల్‌కు బ్రిట‌న్ వార్నింగ్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: పాల‌స్తీనాపై ఇజ్రాయిల్ పాశ‌విక దాడుల విష‌యం తెలిసిందే. ఇచ్చ‌ల‌విడి బాంబులు, ఫైట‌ర్ జెట్ల‌ల‌తో దాడులు చేస్తు భారీగా మాన‌వ‌ హ‌న‌నానికి పాల్ప‌డుతుంది. ఇజ్రాయిల్ దాడుల‌తో గాజా శ‌వాల దిబ్బ‌ల మారింది. ఆక‌లి బాధ‌తో చిన్నారులు అల‌మ‌టిస్తున్నారు. నిత్యావ‌స‌ర ధ‌ర‌లు పెరిగిపోయి ప్ర‌జ‌లు అల్లాడిపోతున్నారు. ఈక్ర‌మంలో పాల‌స్తీనాపై ఇజ్రాయిల్ అరాచ‌కాన్ని యూర‌ప్ దేశాలు బ‌హాటంగా ఖండిస్తున్నాయి. తాజాగా పాలస్తీనా విషయంలో ఫ్రాన్స్‌ దారినే బ్రిటన్‌ సైతం అనుసరిస్తోంది. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్‌ అంగీకరించకుంటే ప్రత్యేక పాలస్తీనా ఏర్పాటుకు వచ్చే సెప్టెంబర్‌లో ఐక్యరాజ్యసమితిలో జరిగే సర్వప్రతినిధి సభలో ప్రవేశపెట్టే తీర్మానానికి మద్దతిస్తామని బ్రిటన్‌ ప్రధానమంత్రి కీర్‌ స్టార్మర్‌ స్పష్టం చేశారు. ఈ దిశగా ఇజ్రాయెల్‌ చర్యలు తీసుకోకుంటే పాలస్తీనాను దేశంగా గుర్తిస్తామని ఆయన ప్రకటించారు.

అదే సమయంలో, హమాస్‌ తన వద్ద ఉన్న బందీలందరినీ తక్షణమే విడుదల చేయాలని కోరారు. కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకం చేసి, ఆయుధాలను అప్పగించాలన్నారు. భవిష్యత్తులో గాజాలో ఎటువంటి భూమిక పోషించబోమనే హామీని హమాస్‌ ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ఇదే సరైన అదను అని స్టార్మర్‌ తెలిపారు. ఇటీవలే ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ సైతం రెండు దేశాల విధానానికి మద్దతు ప్రకటించడం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -