కైరో : గాజాలో తాగునీరు, పారిశుధ్యం, పరిశుభ్రత వంటి సేవల కోసం 27 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని అంద జేస్తానని బ్రిటన్ ప్రకటించింది. శాంతి సదస్సుకు హాజ రయ్యేందుకు ఈజిప్ట్ రాజధాని కైరో చేరుకున్న బ్రిటన్ ప్రధాని కెయిర్ స్టార్మర్ ఈ విషయాన్ని తెలియజేశారు. యూనిసెఫ్, ప్రపంచ ఆహార కార్యక్రమం, నార్వే శరణార్థి కౌన్సిల్ ద్వారా నిధులు అందజేస్తామని బ్రిటన్ తెలిపింది. కరువు, పోషకాల లోపం, వ్యాధులతో బాధపడుతున్న వారికి సాయం చేయడమే సహాయ ప్యాకేజీ ఉద్దేశమని వివరించింది. గాజా పునర్నిర్మాణంపై మూడు రోజుల సదస్సు నిర్వహిస్తామని చెప్పింది. వివిధ దేశాల ప్రభుత్వ ప్రతినిధులు, ప్రయివేటు రంగ ప్రతినిధులు, అభివృద్ధికి ఆర్థిక సాయం అందించే సంస్థల ప్రతినిధులు దీనికి హాజరవుతారు. యూరోపియన్ బ్యాంక్ ఫర్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్, ప్రపంచబ్యాంక్ ప్రతినిధులు కూడా ఈ సదస్సులో పాల్గొంటారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పాలస్తీనాకు మానవతా సాయంగా 74 మిలియన్ పౌండ్లు అందజేశామని బ్రిటన్ తెలియజేసింది. పాలస్తీనా రాజ్యాన్ని బ్రిటన్ గత నెలలో గుర్తించిన విషయం తెలిసిందే.
గాజాకు బ్రిటన్ సాయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES