Friday, September 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసీఎం రేవంత్‌రెడ్డితో బ్రిటీష్‌ హైకమిషనర్‌ భేటీ

సీఎం రేవంత్‌రెడ్డితో బ్రిటీష్‌ హైకమిషనర్‌ భేటీ

- Advertisement -

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
రాష్ట్ర ముఖ్యమంత్రితో భారత బ్రిటీష్‌ హై కమిషనర్‌ లిండి కామెరాన్‌ భేటీ అయ్యారు. గురువారం హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో తన బృందంతో లిండి కలిశారు. యూకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే స్కాలర్‌షిప్‌ కో-ఫండింగ్‌ ప్రాతిపదికన తెలంగాణ మెరిట్‌ విద్యార్థులకు అందించేందుకు వారు అంగీకరించారు. విద్య, సాంకేతిక సంబంధిత రంగాల్లో సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు సీఎంకు బ్రిటీష్‌ హైకమిషనర్‌ వివరించారు. యూకే యూనివర్సిటీల్లో చదువుకునే తెలంగాణ విద్యార్థుల కోసం హైదరాబాద్‌ నుంచి అక్కడి యూనివర్సిటీలు ఆపరేట్‌ చేసేలా చూడాలని సీఎం కోరారు. ఈ సందర్భంగా తెలంగాణలో తీసుకురాబోతున్న కొత్త విద్యా విధానాన్ని సీఎం హైకమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లకు శిక్షణ అందించేందుకు లిండి ఒప్పుకున్నారు. మూసీ రివర్‌ఫ్రంట్‌ అభివృద్ధిలో బ్రిటీష్‌ కంపెనీలు భాగస్వాములు కావాలని కోరారు. జీసీసీ, ఫార్మా, నాలెడ్జ్‌, అకాడమీ విభాగాల్లో పెట్టుబడులకు ముందుకురావాలని సీఎం కోరారు. ఇందుకు హైకమిషనర్‌ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో బ్రిటీష్‌ హైకమిషనర్‌ వెంట డిప్యూటీ హైకమిషనర్‌ గారెత్‌ విన్‌వోవెన్‌, సలహాదారు నళినా రఘురామన్‌, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, విష్ణువర్థన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -