Wednesday, September 17, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంబ్రిటన్ ప్రధాని భార‌త్ ప‌ర్య‌ట‌న‌..?

బ్రిటన్ ప్రధాని భార‌త్ ప‌ర్య‌ట‌న‌..?

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అక్టోబర్‌లో చివరి నాటికి భారత్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. ప్రధాని మోడీ ఇటీవల లండన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, ఫిన్‌టెక్‌పై ఒప్పందాలు జరిగాయి. ఈ సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు కీర్ స్టార్మర్ అక్టోబర్‌లో భారత్‌కు రావొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా వేసవిలోనే ఈ పర్యటన జరగాల్సి ఉండగా అప్పుడు సాధ్యం కాలేదు. దీంతో అక్టోబర్ చివరి నాటికి పర్యటన ఉండొచ్చని వర్గాలు పేర్కొన్నాయి.

మ‌రోవైపు ఫిన్‌టెక్ సమావేశంలో భాగంగా కీర్ స్టార్మర్ ముంబైలోనే ఉండొచ్చని వర్గాలు భావిస్తున్నాయి. గత సంవత్సరంలో ప్రధాని మోడీ-కీర్ స్టార్మర్ అనేక సార్లు కలిశారు. ఇక గత జూలైలో కూడా మోడీ లండన్‌లో పర్యటించారు. రాబోయే సంవత్సరాల్లో ఇరు దేశాల మధ్య ఆర్థిక వ్యవస్థలు బలోపేతం దిశ‌గా మ‌రోసారి భేటీకానున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -