సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛ అత్యంత విలువైందనీ, సమాజానికి ప్రాణవాయువు లాంటిదని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, రిటైర్డ్ లోకాయుక్తా (గోవా) జస్టిస్ బి సుదర్శన్‌రెడ్డి అన్నారు. రాజ్యాంగం పరిమితుల్లేని స్వేచ్ఛకు హామీనివ్వలేదని గుర్తుచేశారు. ఇటీవల ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా ప్రసారం చేసిన కథనాలను సుదర్శన్‌రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో ఖండిరచారు. సోషల్ మీడియా.. ప్రధాన స్రవంతిలోని మీడియా.. ప్రచార సాధనాలు ఏవయినా సరే బాధ్యత లేకుండా భావప్రకటన స్వేచ్ఛను వినియోగిస్తే నియంత్రణ కూడా అదేస్థాయిలో ప్రతిస్పందిస్తుందన్నారు. ఇది కూడా అత్యంత ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు. స్వీయ నియంత్రణ, సమాజం పట్ల బాధ్యతగా ప్రవర్తించడం చేతగాకపోతే మీ భావప్రకటనా స్వేచ్ఛను మరొకరు నియంత్రించకుండా మీకు మీరే ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాలని హితవు పలికారు. తమ బాధ్యతను అత్యంత సమర్థవంతంగా నిర్వహించే యువ మహిళా అధికారుల పట్ల భావప్రకటన స్వేచ్ఛ పేరుతో అమర్యాదగా, వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేవిధంగా రాయడం, ప్రసారం చేయడం తగదని చెప్పారు. ఇది పురుషాధిక్యత భావజాలంతో కూడిన ప్రమాదకరమైన దుశ్చర్య అని వ్యాఖ్యానించారు.
మహిళా అధికారుల పట్ల అసభ్య ప్రసారాలు సరికాదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



