చెత్త తరలింపు, తాగునీటికి ఇబ్బందులు
నవతెలంగాణ – పెబ్బేరు
పెబ్బేరు పురపాలక కార్యాలయ వాహనాలు మొరాయించాయి. ప్రతిరోజు పురపాలక కేంద్రంలో చెత్త తరలించే వాహనాలు, తాగునీరు సరఫరా చేసే ట్యాంకర్లు, చనిపోయిన వారి మృతదేహాలను తీసుకెళ్లే పార్థివ దేహం వాహనాలకు మరమ్మత్తులు లోపించడంతో వాహనాల సేవలు నిలిచిపోయాయి. పట్టణంలో ప్రజలకు సాగునీరు అందించే మిషన్ భగీరథ సరఫరా లో తరచూ ఆటంకాలు కలగడం వల్ల ఆయా కాలనీలకు నీటి సరఫరా చేసేందుకు ఉన్న రెండు నీటి ట్రాక్టర్ ట్యాంకర్లలో ఒక్కటి మాత్రమే పనిచేస్తుంది. చెత్త తరలించే ఆటోలు, సైకిల్ రిక్షాలు వినియోగంలో లేకపోవడంతో ఒక ట్రాక్టర్ మాత్రమే పట్టణం మొత్తంగా చెత్త తరలిస్తుండడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చెత్త తరలించే రెండు ఆటోలు, రెండు సైకిల్ రిక్షాలు తుక్కు పడిపోతున్నాయి.
పట్టణంలో చనిపోయిన మృతదేహాలను స్మశానాలకు తరలించే పార్థివ దేహ వాహనం కూడా రెండు నెలలుగా చిన్నపాటి మరమ్మతుల కారణంగా నిలిచిపోవడంతో చనిపోయిన మృతుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ కార్యాలయం పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో చెత్త తరలించడం సమస్యగా మారింది. ఇప్పటికైనా పురపాలక అధికారులు స్పందించి మరమ్మత్తుల లోపించిన వాహనాలను బాగు చేయించి వినియోగంలోకి తేవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
మొరాయించిన పురపాలక వాహనాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES