- Advertisement -
నవతెలంగాణ – బజార్ హత్నూర్
మండల కేంద్రంలోనీ పాత బస్టాండ్ సమీపంలో నిత్యం జనం ఉండే ప్రదేశంలో ఆకస్మాత్తుగా విద్యుత్ వైర్లు తీగిపడ్డా సంఘటన జరగడంతో అక్కడ ఉన్న ప్రజలు పరుగులు తీశారు. విద్యుత్ వైర్లు పడిన ప్రదేశం ఎవరు లేకపోవడం తో పెద్ద పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని వైర్లను మరమత్తులు చేశారు. ఇదే సంఘటన పలు మార్లు చోటుచేసుకున్న విద్యుత్ అధికారులు పాటించుకోకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ వైర్లు పాతవి కావడంతో పదే పదే తెగిపోతున్నాయని విద్యుత్ వైర్లను మార్చాలని అధికారులను స్థానికులు కోరుచున్నారు.
- Advertisement -