Thursday, September 11, 2025
E-PAPER
Homeజిల్లాలుఖలీల్ వాడి ప్రాంతంలో విరిగిన చెట్టు 

ఖలీల్ వాడి ప్రాంతంలో విరిగిన చెట్టు 

- Advertisement -

సుమారు నాలుగు గంటలైన తొలగించని వైనం 
గంటల తరబడి ట్రాఫిక్ జామ్ 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖలీల్ వాడి ప్రాంతంలో గల గ్రంథాలయం కు కూత వేటు దూరంలో సుమారు మధ్యాహ్నం 12:30 గంటలకు చెట్టు విరిగింది. అప్పటినుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఏ ఒక్క సంబంధిత శాఖ అధికారులు స్పందించకపోవడంతో గంటల తరబడి ట్రాఫిక్ అంతరాయం కలిగింది. అక్కడి నుండి చుట్టుపక్కల గల ప్రాంతాల మార్గాలలో వాహనదారులు దానిని చూస్తూ వెళ్లిపోయారు. కొంతమంది విరిగిన చెట్టు కింద నుండే బైక్లను తీసుకొని వెళ్లారు. ఒక్క చెట్టు విరుగుతేనే సుమారు నాలుగు గంటల తర్వాత అధికారులు వస్తే ఎలా అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -