– ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్స్
షింకెంట్ (కజకిస్తాన్): మహిళల 25మీ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో ఇషా సింగ్, మను భాకర్, సిమ్రన్‌ప్రీత్ కౌర్ త్రయం కాంస్య పతకం సాధించింది. కజకిస్తాన్‌లో జరుగుతున్న ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్స్‌లో 1749 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన మన అమ్మాయిలు బ్రాంజ్ మెడల్ అందుకున్నారు. చైనా (1759), దక్షిణ కొరియా (1749) వరుసగా పసిడి, సిల్వర్ పతకాలు సాధించాయి. మహిళల 25మీ వ్యక్తిగత విభాగంలో క్వాలిఫికేషన్‌లో ఇషా సింగ్ (588) అగ్రస్థానంలో నిలువగా.. మను భాకర్ ద్వితీయ స్థానంలో నిలిచింది. మెడల్ ఈవెంట్‌లో చైనా షూటర్లు పసిడి, రజతం గురిపెట్టగా..వియత్నాం షూటర్ కాంస్యం సాధించింది. మను భాకర్ (4), ఇషా సింగ్ (6) స్థానాలతో సరిపెట్టుకున్నారు. మహిళల ట్రాప్ విభాగంలో నీరు దండా (43/50) పసిడి పతకం నెగ్గగా.. మెన్స్ ట్రాప్‌లో భోవనీస్ (45/50) సిల్వర్ సాధించాడు.
ఇషా త్రయానికి కాంస్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES