Saturday, June 14, 2025
E-PAPER
Homeఆటలుఆరాధ్యకు కాంస్య పతకం

ఆరాధ్యకు కాంస్య పతకం

- Advertisement -

కియో జాతీయ కరాటే పోటీలు
హైదరాబాద్‌ :
4వ కియో జాతీయ కరాటే చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన యువ అథ్లెట్‌ ఆరాధ్య తాళపత్రి కాంస్య పతకం సాధించింది. ఉత్తరాఖాండ్‌లోని డెహ్రాడూన్‌లో జరుగుతున్న పోటీల్లో బాలికల కటా విభాగంలో ఆరాధ్య సత్తా చాటింది. నిరుడు దక్షిణాఫ్రికాలో జరిగిన కామన్‌వెల్త్‌ కరాటే పోటీల్లో సైతం ఆరాధ్య బంగారు, కాంస్య పతకాలతో మెరిసింది. జాతీయ పోటీల్లో మెడల్‌ సాధించిన ఆరాధ్య, ఆమె కోచ్‌ సేన్‌ నరేశ్‌ను తెలంగాణ కియో కరాటే అసోసియేషన్‌ అధ్యక్షులు, పీసీసీ ప్రెసిడెంట్‌ ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -