ఎంసీపల్లి, ఎల్లంపేట కైవసం
ఆలియాబాద్‌లో హంగ్
కాంగ్రెస్ రెండో స్థానానికే పరిమితం
నవతెలంగాణ-సిటీబ్యూరో
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సత్తా చాటింది. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా వెలువడిన ఫలితాల్లో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మూడు మున్సిపాల్టీలకుగాను బీఆర్‌ఎస్ మూడు చింతపల్లి, ఎల్లంపేటను కైవసం చేసుకోగా.. ఆలియాబాద్‌లో 7 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అధికార కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో ఎదురు దెబ్బే తగిలింది. రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక మున్సిపాల్టీల్లో సత్తా చాటినా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. రెండు మున్సిపాల్టీల్లో రెండో స్థానానికే పరిమితం కాగా.. ఒక్క మున్సిపాల్టీలో మాత్రమే కాస్త రాణించింది. ఇక బీజేపీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మూడు మున్సిపాల్టీల్లో 68 వార్డులకు గాను కేవలం 8 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాగా అలియాబాద్‌లో బీఎస్పీకి ఒక్క సీటు, స్వతంత్య్ర అభ్యర్తికి ఒక్క సీటు వచ్చింది. మొత్తంగా మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ 14 వార్డులు గెలుచుకుని స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది.కాంగ్రెస్ 9 స్థానాల్లో విజయం సాధించగా, బీజేపీ ఒక స్థానాన్ని దక్కించుకుంది. ఎల్లంపేట మున్సిపాలిటీలో 24 వార్డులకు గాను బీఆర్‌ఎస్ 12 స్థానాలు గెలుచుకోగా కాంగ్రెస్ 8 స్థానాలు, బీజేపీ 4 స్థానాలు గెలుచుకున్నాయి. ఇక ఆలియాబాద్ మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో కాంగ్రెస్ 8, బీఆర్‌ఎస్ 7, బీజేపీ 3 స్థానాలు గెలుచుకున్నాయి. బీఎస్పీ, ఒక స్వతంత్ర అభ్యర్థి ఒక్కో స్థానంలో విజయం సాధించారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఇక్కడ హంగ్ ఏర్పడింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను జిల్లాలో ప్రజలు ఆదరించలేదు. సంక్షేమ పథకాలు, ఇచ్చిన హామీలను మూడు మున్సిపాల్టీల ఓటర్లు పెద్దగా పట్టించుకోలేదు. మంత్రి, జిల్లాకు చెందిన అగ్ర నాయకులు ప్రచారం చేసినా.. ప్రజల మన్ననను పొందలేకపోయారు.
‘మేడ్చల్ మల్కాజిగిరి’లో బీఆర్‌ఎస్ హవా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



