– రాష్ట్ర మాజీ, మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బాల్కొండ నియోజకవర్గంతో పాటు జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర మాజీ, మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం వేల్పూర్ మండల కేంద్రంలో గ్రామ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అందరి ఆమోదంతో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన వేల్పూర్ సర్పంచ్ అభ్యర్థి మొండి అశోక్ ను ఎన్నికల్లో భారీ మెజారిటీ తో గెలిపించాలని కార్యకర్తలకు దిశనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి నియోజకవర్గంతో పాటు జిల్లాలో పెద్ద సంఖ్యలో సర్పంచ్, వార్డు పదవులను గెలుపొందేలా కృషి చేయాలన్నారు. ఎన్నికల్లో విభేదాలకు తావివ్వొద్దని సూచించారు.
బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



